Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పశ్చిమ బెంగాల్‌లో దారుణం.. తల్లి ఒడి నుంచి చిన్నారిని లాక్కెళ్లిన చిరుతపులి!

  • తల్లి ఒడి నుంచి చిన్నారిని లాక్కెళ్లిన పులి
  • భయంతో కేకలు వేసిన తల్లి
  • తేయాకు తోటలో కనిపించిన చిన్నారి శరీర భాగాలు
పశ్చిమబెంగాల్‌లోని అలీపూర్‌దవార్ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని లేబర్‌లైన్‌లో నివాసముంటున్న పూజ ఒరాన్ ఇంట్లోకి  మంగళవారం రాత్రి ఓ చిరుతపులి ప్రవేశించింది. ఆ సమయంలో మూడేళ్ల కుమార్తె ప్రణీతను పూజ నిద్రపుచ్చుతోంది. అకస్మాత్తుగా ఇంట్లో ప్రత్యక్షమైన పులిని చూసిన ఆమె భయంతో హడలిపోయింది. పులి నుంచి రక్షించుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పులి ఒక్కసారిగా మీదికి దూకి చిన్నారి ప్రణీతను నోట కరుచుకుని వెళ్లిపోయింది.

కుమార్తెను కాపాడుకునేందుకు చిరుతను బెదిరించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పూజ అరుపులు విన్న చుట్టుపక్కల వారు వెంటనే వచ్చి చిన్నారి కోసం గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూజ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. బుధవారం ఉదయం మదరిహత్‌లోని ఓ టీ తోటలో చిన్నారి శరీర భాగాలు కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
West Bengal
Leopard
Tiger
Mother
Police

More Telugu News